మరోసారి కస్టడీకి విజయపాల్.. ఒంగోలుకు తరిలింపు 19 h ago
మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన విశ్రాంత ఏఎస్పీ విజయ్పాల్ ను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.స్రవంతి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించిన తరువాత ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో పోలీసులు 24 గంటల పాటు విజయ్పాల్ ను విచారణచేసి ప్రశ్నించనున్నారు.